దుబాయ్ లో తెలంగాణా వాసి మృతి
- August 05, 2016
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వలస కార్మికుడు దుబాయిలో మరణించాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తాడూరు పంచాయతీ పాపయ్యపల్లికి చెందిన చెన్నవేని రాములు (41) గతేడాది ఉపాధి కోసం దుబాయి వచ్చారు. అక్కడ మరికొందరితో కలసి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే గురువారం రాత్రి రాములకు తీవ్ర గుండెపోటు వచ్చింది.
దీంతో అతడిని ఆసుపత్రికి తరలించేందుకు సహచరులు ప్రయత్నించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందాడు. ఈ మరణవార్తను సహచరులు రాములు కుటుంబసభ్యులకు ఫోన్ లో తెలిపారు. దీంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. రాములుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







