సౌదీలో తీవ్రమైన గాలులు, ధూళి తుఫానులు..NCM హెచ్చరిక

- April 16, 2026 , by Maagulf
సౌదీలో తీవ్రమైన గాలులు, ధూళి తుఫానులు..NCM హెచ్చరిక

రియాద్: రాబోయే రెండు రోజులపాటు సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో ధూళి, ఇసుక తూఫానులు చెలరేగే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది.  ఈ వాతావరణ అంచనా సౌదీ న్యూమెరికల్ వెదర్ మోడల్ (numerical weather model) ఫలితాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కాలంలో ధూళి/ఇసుక మరియు అలల కదలిక, తీవ్రత ఎలా ఉంటాయో వివరిస్తూ NCM ఒక యానిమేటెడ్ మ్యాప్‌ను కూడా విడుదల చేసింది.

ఈ అంచనా ప్రకారం తబూక్, మదీనా, మక్కా మరియు జాజాన్ ప్రాంతాల అంతటా పగటిపూట, ధూళి మరియు ఇసుక తుఫానులు ప్రభావం ఉంటుందని, తీరప్రాంతాల్లో అయితే దీనికి తోడుగా సముద్రంలో అలలు కూడా ఉధృతంగా ఉంటాయని అంచనా వేసింది.

శనివారం నాటికి ఈ తీవ్రమైన గాలుల ప్రభావం అల్-జౌఫ్, ఉత్తర సరిహద్దులు (Northern Borders) మరియు హాయిల్ ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని తెలిపింది. 

అయితే, ఖాసిమ్, రియాద్, తూర్పు ప్రావిన్స్ మరియు నజ్రాన్ ప్రాంతాల్లోని కేవలం కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలోనే ఈ వాతావరణ ప్రభావం ఉంటుందని NCM తన ప్రకటనలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com