ఇటలీ లో రోడెక్కిన విమానం
- August 05, 2016
ఇటలీలో ఓ విమానం రోడ్డెక్కింది. రన్ వేను దాటుకుంటూ వచ్చిన విమానం రోడ్డుపైకి అడ్డంగా దూసుకొచ్చింది. దీంతో ఖిన్నులైన రోడ్డు వాహనాదారులు తమ వాహనాలు ఎక్కడికక్కడ నిలిపేశారు. అయితే, పేలుడులాంటి సంఘటన చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.డీహెచ్ఎల్ సంస్థకు చెందిన బోయింగ్ 737-400 అనే కార్గో విమానం తెల్లవారు జామున ఇటలీలోని లాంబార్డీ ప్రాంతంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే క్రమంలో రన్ వేను దాటుకుంటూ నియంత్రణ కోల్పోయి రయ్ మంటూ రోడ్డెక్కింది. ఈ ప్రమాదం జరగడంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా కొన్నిగంటలు మూసి వేసి అనంతరం తెరిచారు. ప్రమాదానికి గురైన విమానం ప్యారిస్ నుంచి వచ్చినట్లు అధికారులు చెప్పారు. విమాన సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని మీడియా ప్రతినిధులు చెప్పారు.
తాజా వార్తలు
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..







