మారిన బాహుబలి - 2 విడుదల తేదీ

- August 05, 2016 , by Maagulf
మారిన బాహుబలి - 2 విడుదల తేదీ

తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన చిత్రం 'బాహుబలి'. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. 'బాహుబలి' విడుదలై ఏడాది పూర్తయినా కూడా ప్రపంచంలో ఏదో ఒక చోట ఈ చిత్రం ప్రదర్శితమవుతూనే ఉంది.
'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో' తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అది తెలియాలంటే 'బాహుబలి: ద కన్‌క్లూజన్‌' చూడాల్సిందే. దర్శకుడు రాజమౌళి, ఆయన బృందం ఇదే పనిలో ఉంది. ప్రస్తుతం యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 28 ఏప్రిల్‌ 2017న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత కరణ్‌జోహార్‌ వెల్లడించారు. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బాలీవుడ్‌లో 'బాహుబలి'ని కరణ్‌జోహార్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలుత ఈ చిత్రాన్ని 14 ఏప్రిల్‌ 2017 విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదల తేదీలో మార్పు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com