ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం

- April 18, 2026 , by Maagulf
ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం

దోహా: ఇటీవల నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితుల్లో, ఎంబసీ ఆఫ్ ఇండియా, దోహా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ హెల్ప్ డెస్క్‌లో విశేష సేవలందించిన తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధును భారత రాయబారి విపుల్  అభినందించారు.

ఇండియన్ కమ్యూనిటీ పిలుపు మేరకు ముందుకు వచ్చిన మధు, దాదాపు నెల రోజుల పాటు అహర్నిశలు సేవలు అందించారు. ఈ క్లిష్ట సమయంలో కార్మికులకు అవసరమైన సమాచారం, సహాయం, మార్గదర్శనం అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు.

కష్టకాలంలో కార్మికుల పక్కన నిలబడి వారికి ధైర్యం చెప్పిన ఆయన సేవలు ప్రశంసనీయమని అధికారులు పేర్కొన్నారు. ఈ సత్కారం ఆయన చేసిన సేవలకు గౌరవ సూచకంగా మాత్రమే కాకుండా, సమాజం కోసం నిరంతరం కృషి చేసే ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ఖతర్‌లో భారతీయ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న మైదం మధు సేవలు కమ్యూనిటీలో విశేష గుర్తింపు పొందాయి.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్‌)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com