ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- April 18, 2026
దోహా: ఇటీవల నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితుల్లో, ఎంబసీ ఆఫ్ ఇండియా, దోహా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ హెల్ప్ డెస్క్‌లో విశేష సేవలందించిన తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధును భారత రాయబారి విపుల్ అభినందించారు.
ఇండియన్ కమ్యూనిటీ పిలుపు మేరకు ముందుకు వచ్చిన మధు, దాదాపు నెల రోజుల పాటు అహర్నిశలు సేవలు అందించారు. ఈ క్లిష్ట సమయంలో కార్మికులకు అవసరమైన సమాచారం, సహాయం, మార్గదర్శనం అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు.
కష్టకాలంలో కార్మికుల పక్కన నిలబడి వారికి ధైర్యం చెప్పిన ఆయన సేవలు ప్రశంసనీయమని అధికారులు పేర్కొన్నారు. ఈ సత్కారం ఆయన చేసిన సేవలకు గౌరవ సూచకంగా మాత్రమే కాకుండా, సమాజం కోసం నిరంతరం కృషి చేసే ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఖతర్‌లో భారతీయ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న మైదం మధు సేవలు కమ్యూనిటీలో విశేష గుర్తింపు పొందాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







