100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!

- April 18, 2026 , by Maagulf
100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!

కువైట్ః కువైట్ లో బ్యాంకింగ్ సేవలు 100 శాతం సామర్థ్యంతో తిరిగి ప్రారంభమయ్యాయని కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ ప్రకటించింది.ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఈ సందర్భంగా బ్యాంకింగ్ సిబ్బంది అంకితభావాన్ని అసోసియేషన్ ప్రశంసించింది. బ్యాంకులలో పనిచేసే సిబ్బంది, ఆఫీసర్లు అన్ని పరిస్థితులలోనూ తమ పనిని సమర్థవంతంగా నిర్వర్తించగలరని నిరూపించుకున్నారని పేర్కొంది. దేశ బ్యాంకింగ్ రంగంపై వినియోగదారులు నిరంతరం ఉంచుతున్న నమ్మకం పట్ల కూడా  హర్షం వ్యక్తం చేసింది. ఇది బ్యాంకింగ్ సేవల్లో సాధారణ స్థితికి తిరిగి రావడాన్ని సూచిస్తుందని కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com