చికాగోలో ముస్లిం జంటను విమానం నుండి దించేసి వైనం

- August 05, 2016 , by Maagulf
చికాగోలో  ముస్లిం జంటను విమానం నుండి దించేసి వైనం

 పాకిస్తాన్ - అమెరికన్ జంటకు అమెరికాకు చెందిన ఓ విమానంలో చేదు అనుభవం ఎదురయింది. వారు చెమటలు కక్కుతుండటం, అల్లా పేరు పలుమార్లు ఉచ్చరించడాన్ని గమనించిన తోటి ప్రయాణీకులు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో వారిని విమానం నుంచి దింపేశారు.
నజియా, ఫైసల్ ఆలీ తమ పదవ పెళ్లి వేడుకను వారం పాటు ప్యారిస్‌లో సంతోషంగా జరుపుకున్నారు. తిరిగి అమెరికా ఓహియోలోని సిన్సినాటి వెళ్లేందుకు డెల్టా ఎయిర్ లైన్స్ విమానం ఎక్కారు. తమ సీట్లలో కూర్చున్న తర్వాత నజియా తన సెల్‌ఫోన్లో తల్లిదండ్రులకు సందేశం పంపించింది.
ఆమె భర్త ఫైసల్ అలీ ఓ సెల్‌ఫోన్ దాయడంతో పాటు చెమటలు కక్కుతున్నాడు. వారి తీరు ప్రయాణీకులకు అనుమానం కలిగించింది. విమానయాన సిబ్బంది అక్కడకు వచ్చారు. ఆ జంట అప్పుడప్పుడు అల్లాహో అని ఉచ్చరించారు. దీంతో ప్రయాణీకులు అనుమానంతో ఫిర్యాదు చేశారు.
ఈ జంటపై అనుమానం కలగడంతో పైలెట్ గ్రౌండ్ సిబ్బందికి విషయం తెలిపాడు. లోపలకు వచ్చిన సదరు అధికారి ముస్లిం జంటను విమానంలో నుంచి దించాడు. అనంతరం వారిని ప్రశ్నించగా.. ఎలాంటి సమస్యలేదని నిర్థారించారు. దీంతో అమెరికాకు ఇస్లామోఫోబియా పట్టుకుందని ఈ జంట విమర్శించింది. ఎయిర్ లైన్స్ తీరుపై అమెరికా రవాణా శాఖకు ఫిర్యాదు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com