#SVC63 మూవీ హై-ఆక్టేన్ మొదటి షెడ్యూల్ ఈ రోజు ముంబైలో ప్రారంభం
- April 18, 2026
సల్మాన్ ఖాన్–వంశీ పైడిపల్లి–దిల్ రాజు కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ షూటింగ్ దశలోకి అడుగుపెట్టింది. ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవగా, కథానాయికగా నయనతార అధికారికంగా సెట్స్‌లో చేరారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ కొలాబరేషన్ కావడం విశేషం. ఈ కాంబినేషన్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించగా, షూటింగ్ ప్రారంభంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది.
#SVC63 ప్రాజెక్టు ఈరోజు సంప్రదాయ ముహూర్తం కార్యక్రమంతో ప్రారంభమై, నెల రోజులపాటు సాగనున్న భారీ షెడ్యూల్ మొదలైంది. ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన హ్యూజ్ సెట్లో హై-ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ కీలక షెడ్యూల్లో నయనతార కూడా ప్రధాన తారాగణంలో చేరారు. ప్రతి పాత్రని బలంగా తీర్చిదిద్దే వంశీ పైడిపల్లి, ఈ చిత్రంలో ప్రధాన పాత్రలని అద్భుతంగా రూపొందించారు. సల్మాన్ ఖాన్–నయనతార జోడీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
దర్శకుడు వంశీ పైడిపల్లి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ “#సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి ఫిల్మ్… ఈరోజు మొదలైంది..” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
త్వరలోనే పూర్తి తారాగణం, సాంకేతిక బృందం వివరాలను వెల్లడించనున్నారు.
బలమైన భావోద్వేగాలతో కూడిన హై ఎనర్జీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం 2027లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం: సల్మాన్ ఖాన్, నయనతార
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాత: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







