ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- April 20, 2026
మనామా: ఇండియన్ స్కూల్ వృద్ధిని బాహ్యశక్తులు అడ్డుకుంటున్నాయని ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ పేరెంట్స్ ప్యానెల్ (UPP) ఆరోపించింది. బాహ్యశక్తుల జోక్యంతోపాటు పరిపాలనాపరమైన అసమర్థతలు సంస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
UPP అధికారులు పాఠశాల కార్యనిర్వాహక కమిటీపై విమర్శలు గుప్పించారు. స్కూల్ వ్యవహారాల్లో పారదర్శకత లోపించిందని, తల్లిదండ్రులు లేవనెత్తిన కీలక ఆందోళనలను పరిష్కరించడంలో మేనేజ్ మెంట్ విఫలమయ్యారని వారు ఆరోపించారు. ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో మార్చి నెల రవాణా రుసుములను మాఫీ చేయాలని పదేపదే చేసిన అభ్యర్థనలకు స్పష్టమైన స్పందన లేదని మండిపడ్డారు.
కేవలం BD 20 వంటి తక్కువ బకాయిలు చెల్లించనందుకు విద్యార్థులను ఆన్లైన్ తరగతులకు హాజరుకాకుండా నిరోధించడాన్ని కూడా ప్యానెల్ వ్యతిరేకించింది. ఇది వార్షిక సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధమని పేర్కొంది.
ఆర్థికపరమైన ఆందోళనలను లేవనెత్తుతూ.. 'ఆర్థిక పరిమితులు' అని పదేపదే ప్రస్తావించడాన్ని యూపీపీ ప్రశ్నించింది. ముఖ్యంగా, మార్చి 2026 నాటికి రిఫా క్యాంపస్ రుణం తీరిపోతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల రుసుము భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిపాలనలో మెగా ఫెయిర్ వసూళ్లు తగ్గుముఖం పట్టాయని కూడా పేర్కొన్నారు.
తల్లిదండ్రులు కానివారు, మాజీ కమిటీ సభ్యులు పాఠశాల కార్యకలాపాలలో సున్నితమైన ఐటీ వ్యవస్థలను నిర్వహించడంతో సహా పలు విషయాల్లో పాలుపంచుకుంటున్నారని, ఇది గోప్యతా ఆందోళనలను రేకెత్తిస్తోందని యూపీపీ ఫైర్ అయింది. అనుభవజ్ఞులైన సిబ్బందిని తొలగించారన్న వార్తలను ప్రస్తావిస్తూ.. విద్యా ప్రమాణాలపై దాని ప్రభావం పడొచ్చని హెచ్చరించింది. భారత రాయబార కార్యాలయంతో సహా పలు భాగస్వాముల సమిష్టి కృషి ఫలితాంగానే జేఈఈ పరీక్షా కేంద్రం తిరిగి ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఇందులో వాళ్లు చేసిందేమీ లేదని వెల్లడించారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







