JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- April 20, 2026
న్యూ ఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల (JEE Main Session 2 Result 2026) కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులు ఫలించాయి. ఏప్రిల్ 20, సోమవారం సాయంత్రం జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ (NTA) అధికారులు.. నేటి సాయంత్రం పేపర్-1 (బీఈ/బీటెక్) పరీక్ష తుది ఫలితాలను ప్రకటించారు. స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలని భావించే అభ్యర్థులు..తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌లతో పాటు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ స్కోర్ కార్డు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జేఈఈ (మెయిన్) సెషన్-1, సెషన్-2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన స్కోర్లలో అత్యుత్తమమైన దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. దానికి తగ్గట్టుగా జాతీయ ర్యాంకులను కేటాయించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కటాఫ్ పర్సంటైల్ గతంతో పోలిస్తే ఈసారి కొంత పెరిగి 93.5 పర్సంటైల్ మార్కును తాకింది.
ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించడానికి సుమారు 2.5 లక్షల మంది విద్యార్థులను ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించి జాతీయ స్థాయి టాపర్లుగా నిలిచారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!







