కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- April 21, 2026
మస్కట్: ప్రముఖ కువైట్ నటి హయత్ అల్-ఫహద్ (78) కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా ఆరోగ్య పరమైన సమస్యలతో బాధపడుతున్నారు. ఆరు దశాబ్దాలుగా ఆమె కళారంగానికి సేవలు అందిస్తున్నారు.
"ది లేడీ ఆఫ్ ద గల్ఫ్ స్క్రీన్" (The Lady of the Gulf Screen) అనే పేరుతో ప్రాచుర్యం పొందారు. ఈ ప్రాంతపు కళా రంగంలో అత్యంత ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా గుర్తింపు పొందారు. టెలివిజన్, నాటక రంగం మరియు సినిమా రంగాలలో పనిచేసిన అమె, అనేక పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించారు.
హయత్ అల్-ఫహద్ తన కళా ప్రస్థానాన్ని "A'ilat Bu Jassoum" (బు జస్సూమ్ ఫ్యామిలీ) అనే ధారావాహికతో ప్రారంభించారు. ఆ తర్వాత "Al-Dahya" (విక్టిమ్) అనే నాటకం ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టి, అనంతరం "Bas Ya Bahar" (చాలులే, ఓ సముద్రమా) అనే సినిమాతో సినిమా రంగంలో అడుగుపెట్టారు.
తన కెరీర్ లో అబ్దుల్హుస్సేన్ అబ్దుల్రెధా, సాద్ అల్-ఫరాజ్, సువాద్ అబ్దుల్లా, ఘనేమ్ అల్-సలేహ్, ఖలీద్ అల్-నఫీసి మరియు మహమ్మద్ అల్-మన్సూర్ వంటి ప్రముఖ నటీనటులతో కలిసి నటించారు. ఆమె మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









