'4జీ సేవలంటే.. ఏంటో చూపిద్దాం' : ముకేశ్ అంబానీ
- August 05, 2016
టెలికాం,డేటా సేవల్లో 'రిలయన్స్ జియో' తో సరికొత్త విప్లవానికి నాంది పలకాలని వ్యూహ రచన చేశారు రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ. '4జీ సేవలంటే.. ఏంటో చూపిద్దాం' అనే నినాదంతో 'రిలయన్స్ జియో'ని మార్కెట్ లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జియో ప్రీవ్యూ ఆఫర్ పేరుతో సిమ్‌లను అందుబాటులోకి తెచ్చారు.అత్యాధునిక 4జీ సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందిస్తున్నందున, అందుకు తగ్గట్టుగా మొబైల్ ఫోన్లు ఉండాలన్న ఉద్దేశంతో ఎల్వైఎఫ్ (లైఫ్) స్మార్ట్ ఫోన్లతో కలిపి సిమ్‌లను అందిస్తున్నారు. దింతో మొత్తం టెలీకాం మార్కెట్ లో అగ్రగామిగా ఎదగాలన్నది 'రిలయన్స్ జియో' ప్రధాన వ్యూహ రచన.ఇప్పటికే 15 లక్షల మందికి పైగా రిలయన్స్ జియో సేవలను వినియోగిస్తున్నట్లు అంచనా వేశారు. అయితే ఇది కేవలం ఆల్ఫా, బీటా టెస్టింగులకు ముందుకు వచ్చిన వినియోగదారుల లెక్కమాత్రమే.జియో సేవల్లో ప్రధాన ఫీచర్స్ గురించి చెప్పాలంటే.. 40 ఎంబీపీఎస్ వేగంగాతో డేటా ప్రసారం అవుతుంది. డేటా వేగంతో పాటు హెచ్డీ వాయిస్ వుటుంది. అలాగే సిగ్నల్స్ తక్కువగా ఉన్నా ఎలాంటి ఇంట్రప్షన్ వుండదు.లైఫ్ ఫోన్లు గురించి చెప్పుకుంటే.. ఇందులో నాలుగు సిరీస్‌లలో- ఫ్లేమ్, విండ్, వాటర్, ఎర్త్- లైఫ్ ఫోన్లను మార్కెట్ లోకి తెచ్చింది. ఇందులోఫ్లేమ్ ధర రూ.2,999గా నిర్ణయించారు. ఫ్లేమ్ 3, 4, 5, 6 మోడళ్లు ఈ ధరకు లభిస్తాయి.వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీని వినియోగించుకునే విధంగా ఈ ఫోన్లు రూపొందించారు. హెచ్డీ వాయిస్, వీడియో కాలింగ్ వంటి ఆధునిక సదుపాయాలు ఈ ఫోన్లలో ఉంటాయి. ఇన్ని ఫీచర్లు ఉన్న మొబైల్ ఫోన్ ఇంత తక్కువ ధరకు అందుబాటులోకి రావడం బహుశా ఇదే ప్రధమం ఏమో అన్న అభిప్రాయం కూడా వుంది.ఇలా అనేక విభాగాల్లో వినయోగాదారులు ఆకట్టుకోవడానికి వస్తున్న 'రిలయన్స్ జియో' ..ఇప్పుడు మిగతా టెలికాం కంపెనీలకు గుబులు పుట్టిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ వినియోగదారుల ఆకట్టుకోవడానికి సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు రూ. 1,199కి నెలలో అన్లిమిటెడ్ కాల్స్ చేసుకునే ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో లోకల్ కాల్స్‌తో పాటుగా ఎస్టిడీ, రోమింగ్ కాల్స్, ఎస్సెమ్మెస్, డేటా ప్లాన్లు కూడా ఉన్నాయి.
త్వరలో రిలయెన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశిస్తున్న నేపధ్యంలో పోటీని తట్టుకుని నిలబడేలా, అలాగే వినియోగదారుల చేజారకుండా చూసుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది ఎయిర్టెల్. ఇందులో బాగంగానే ఈ ఆఫర్. మరి, ఎయిర్టెల్ బాటలో ఇంకెన్ని సంస్థలు వినియోగదారులకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







