విజయ్ కుమార్ రూపానీ ఆగస్టు 7న ప్రమాణ స్వీకారం ..
- August 06, 2016
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపికైన విజయ్ కుమార్ రూపానీ రేపు(ఆగస్టు 7న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆనందీబెన్ పటేల్ రాజీనామా చేయడంతో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, రవాణా మంత్రిగా ఉన్న విజయ్ కుమార్ రూపానీని నూతన సీఎంగా.. నితిన్ పటేల్‌ను ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరు ఆదివారం గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరగడం మూడోసారి. 2012 ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం అయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన ప్రధాని అయ్యారు. దీంతో ఆయన స్థానంలోకి ఆనందీబెన్ పటేల్ వచ్చారు. ఆమె రాజీనామాతో ఇప్పుడు రూపానీ సీఎం కానున్నారు.
తాజా వార్తలు
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!







