ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై త్వరలోనే స్పష్టత ..

- August 06, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై త్వరలోనే స్పష్టత ..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై త్వరలోనే స్పష్టత వస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. శనివారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే, భాజపాపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. లోక్‌సభ సాక్షిగా వీరప్పమొయిలీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని కోరారు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పొరుగు రాష్ట్రాల నుంచి పెట్టుబడులు తరలిపోతాయని హెచ్చరించారని చెప్పారు. సభలో నిన్న మాట్లాడిన కాంగ్రెస్‌ సభ్యులు చట్టంలో.. హామీలను ఎందుకు పొందపరచలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఆర్థికమంత్రి, నీతి ఆయోగ్‌ ఛైర్మన్‌ కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com