రాఘవేంద్రరావు దర్శకత్వం లో అనుష్క
- August 06, 2016
అన్నమయ్య, రామదాసు, శిరిడి సాయి లాంటి సినిమాలతో అలరించిన నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఓం నమో వేంకటేశాయా. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేశారు చిత్రయూనిట్. ఇప్పటికే టైటిల్ లోగో, నాగార్జున లుక్ తో పాటు ఏడు కొండలవాడిగా కనిపిస్తున్న ఉత్తరాధి నటుడు సౌరబ్ జైన్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.చాలా రోజులుగా ఈ సినిమాలో అనుష్క ఓ సన్యాసి పాత్రలో కనిపిస్తుందంటూ ప్రచారం జరిగింది. అయితే అనుష్క నటిస్తుందంటూ హింట్ ఇచ్చిన చిత్రయూనిట్ సన్యాసి పాత్ర అని మాత్రం కన్ఫామ్ చేయలేదు. తాజాగా ఓం నమో వేంకటేశాయా సినిమాలో అనుష్క ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు చూపించారు. కృష్ణమ్మ పాత్రలో కనిపిస్తున్న అనుష్క లుక్ ను శనివారం సోషల్ మీడియాలో విడుదల చేశారు. తొలి సారిగా అనుష్క ఓ భక్తిరస చిత్రంలో నటిస్తుండంతో పాటు హిట్ కాంబినేషన్ గా పేరున్న నాగార్జున సినిమా కావటం, గతంలో రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన భక్తిరస చిత్రాలన్ని ఘనవిజయం సాధించంటంతో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దర్శకత్వం లో
తాజా వార్తలు
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!







