బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- April 27, 2026
మనామా: బహ్రెయిన్ మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అటువంటి నేరాలను పరిష్కరించడంలో అంతర్జాతీయ సంస్థల సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా పలు భద్రతా పరమైన ఆపరేషన్లను నిర్వహించారు. ముఖ్యంగా మహిళలను చట్టవిరుద్ధ కార్యకలాపాలకు బలవంతం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇదే ఆరోపణలపై ఒక ఆసియా వ్యక్తితోపాటు మహిళను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఈ కేసుకు సంబంధించిన సమాచారం అందిన తర్వాత క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ సైన్స్ జనరల్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మానవ అక్రమ రవాణా నిరోధక మరియు ప్రజా నైతిక పరిరక్షణ విభాగం ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించిందని వెల్లడించారు. అనుమానితులను గుర్తించి, అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేశామని, తదుపరి చర్యల కోసం ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









