హద్దులు చెరిపేస్తున్న సౌదీ మహిళలు
- August 06, 2016
సౌదీ మహిళలు క్రీడా రంగంలో అద్భుత ప్రతిభను చాటేందుకు సరిహద్దులు చెరిపేసుకుని, ఆకాశమే హద్దు అన్నట్లుగా రాణిస్తున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ కొనియాడింది. నలుగురు మహిళలు ఈసారి రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ సౌదీ మహిళలు పాల్గొన్నారు. కల్చరల్ ఇబ్బందుల్ని ఎదుర్కొని సౌదీ మహిళలు తమ టాలెంట్‌ని ప్రదర్శిస్తున్నారని, క్రీడా రంగంలో సత్తా చాటుకుంటున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్, గ్లోబల్ ఇనీషియేటివ్స్ డైరెక్టర్ మింకీ వార్డెన్ చెప్పారు. సౌదీ ప్రభుత్వం ఇటీవలి కాలంలో మహిళాభ్యున్నతి కోసం, మహిళలు వివిధ రంగాల్లో రాణించడానికి సంబంధించి చేపడుతున్న చర్యలను హ్యూమన్ రైట్స్ వాచ్ అభినందించింది. 2014 ప్రిల్‌లో షురా కౌన్సిల్, బాలికలకు ఫిజికల్ ఎడ్యుకేషన్‌ని తప్పనిసరి చేయాల్సిందిగా ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సూచించడం ఆహ్వానించదగ్గ పరిణామమనీ, ఆ తర్వాత సౌదీ మహిళల ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







