రియో ఒలింపిక్స్ లో బాంబు కలకలం
- August 06, 2016
ప్రపంచ అత్యున్నత క్రీడా సంబరాలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే రియోలో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోపగబానా బీచ్ వద్ద బాంబు ఉందంటూ కలకలం రేగింది. అక్కడ ఓ బ్యాగ్ లో అనుమానిత పేలుడు పదార్థాలున్నాయని సిబ్బందికి సమాచారం రావడంతో ఆధునిక బాంబు చెకింగ్ రోబో స్క్వాడ్ లను రంగంలోకి దింపింది. కొద్దిసమయంలోనే బీచ్, చుట్టుపక్కల ప్రాంతాలను బ్రెజిల్ భద్రతా సిబ్బంది ఖాళీచేయించింది. రియో సంబరాలు ప్రారంభమైన మారకానా స్డేడియానికి మూడు మైళ్ల దూరంలో ఉన్న బీచ్ వాలీవాల్ ప్రాంతానికి దగ్గర్లోనే పురుషుల సైక్లింగ్ రేస్ నిర్వహిస్తారు. దీంతో సిబ్బంది వెంటనే అక్కడ తనిఖీలు చేసి ఆ బ్యాగులో పేలుడు పదార్థాలు లేవని స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రదాడులు తీవ్రరూపం దాల్చిన తర్వాత జరుగుతున్న తొలి ఒలింపిక్ గేమ్స్ కావడంతో బ్రెజిల్ తో పాటు కొన్ని అగ్రదేశాలు తమ దేశ అథ్లెట్ల రక్షణ కోసం చర్యలు చేపట్టాయి. ఇప్పటికే రియో పోలీసులు, దేశ ఆర్మీ బలగాలు ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచాయి. అయితే ఎఫ్ బీఐతో పాటు అమెరికా నిఘా ఏజెన్సీలు(దాదాపు 1000 మందిని ) రియోలో తమ తనిఖీలు ముమ్మరం చేసి బ్రెజిల్ సిబ్బందికి సహకరిస్తున్నాయి.తమ దేశం నుంచి మరికొంత మంది సిబ్బంది సెక్యూరిటీ కోసం బయలుదేరారని అమెరికా నిఘా అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మరోవైపు తమ దేశంలో ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడంపై కొందరు నిరసనకారులు ఆగ్రహించి బ్రెజిల్ జాతీయ పతాకాన్ని దహనం చేసి తమ నిరసన తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ జబీల్ పార్క్‌లో ‘వికసిత్ భారత్ రన్ 2026’.. 1,500 మందికి పైగా పాల్గొనడం
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!
- యూఏఈ లాటరీ డ్రా ఫలితాలు.. ముగ్గురికి చెరో Dh50,000..!!
- థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!
- కువైట్‌లో 13 ఏళ్ల భారతీయ బాలిక.. జెన్ జెడ్ జీవితంపై తొలి పుస్తకం..!!
- వీల్‌చైర్ వినియోగదారులకు అనుకూలంగా వాక్‌వేలు..!!
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం







