భారత్ లో ఉగ్రవాద సానుభూతిపరులకు డబ్బులుఇస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఎన్ఐఏ
- August 06, 2016
జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) భారీ విజయం సాధించింది. ఎన్ఐఏ ఇచ్చిన సమాచారం ఆధారంగా అబ్దుల్లా హడి అబ్దుల్ రెహమాన్ అల్ ఎనెజిని కువైట్‌లో అరెస్టు చేశారు. ఆయనకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ పేర్కొంది. అల్ ఎనెజీ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నాడని, ఐఎస్‌లోకి యువతను నియమిస్తున్నాడని అనుమానిస్తోంది. ఆయన మన దేశంలో అనేకమంది ఐఎస్ సానుభూతిపరులకు నిదులు అందజేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన అరీబ్ మజీద్‌కు కూడా ఎనెజీ నుంచి నిధులు లభించినట్లు సమాచారం. 2014 మేలో ఐఎస్‌లో చేరిన మజీద్ కొద్ది నెలల తర్వాత తిరిగి భారతదేశానికి వచ్చేశాడు. ఎనెజీ తనకు 1,000 డాలర్లు పంపించాడని మజీద్ ఎన్ఐఏ దర్యాప్తులో అంగీకరించాడు.
తాజా వార్తలు
- దుబాయ్ జబీల్ పార్క్‌లో ‘వికసిత్ భారత్ రన్ 2026’.. 1,500 మందికి పైగా పాల్గొనడం
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!
- యూఏఈ లాటరీ డ్రా ఫలితాలు.. ముగ్గురికి చెరో Dh50,000..!!
- థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!
- కువైట్‌లో 13 ఏళ్ల భారతీయ బాలిక.. జెన్ జెడ్ జీవితంపై తొలి పుస్తకం..!!
- వీల్‌చైర్ వినియోగదారులకు అనుకూలంగా వాక్‌వేలు..!!
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం







