మే 27న ఈద్ అల్-అధా..!!

- May 04, 2026 , by Maagulf
మే 27న ఈద్ అల్-అధా..!!

కువైట్: ఖగోళ గణనల ఆధారంగామే 27న ఈద్ అల్-అధా (బక్రీద్) పండుగ వచ్చే అవకాశం ఉందని కువైట్ ఖగోళ శాస్త్ర సంఘం (Kuwaiti Astronomical Society) పాలక మండలి ఛైర్మన్ అడెల్ అల్-సాదౌన్ ప్రకటించారు. 'ధి అల్-హిజ్జా' నెల మొదటి రోజు మే 18న ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఖగోళ లెక్కల ప్రకారం, మే 26న 'అరఫా దినం' (Day of Arafah) వస్తుంది. ఆ మరుసటి రోజే మే 27న ఈద్ అల్-అధా పండుగ ప్రారంభమవుతుంది. ఈద్ సమయంలో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని,  రాత్రిపూట మాత్రం కాస్త తగ్గుముఖం పట్టి, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని అల్-సాదౌన్ పేర్కొన్నారు.

అయితే ఈద్ అల్-అధా పండుగ అధికారిక తేదీని, సంబంధిత అధికారులు నెలవంకను చూసిన తర్వాతే ఖరారు చేస్తారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com