ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్‌లో అగ్ని ప్రమాదం
- May 04, 2026
ఫుజైరా: ఫుజైరాలోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ (FOIZ)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఇరాన్ వైపు నుంచి జరిగిన డ్రోన్ దాడి కారణంగా చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.
డ్రోన్ దాడి అనంతరం పరిశ్రమ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు నిర్ధారించిన అధికారులు, వెంటనే ఫుజైరా సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే చర్యలు ప్రారంభించాయని తెలిపారు. అగ్నిప్రమాదాన్ని నియంత్రించేందుకు రక్షణ బృందాలు నిరంతరంగా శ్రమిస్తున్నాయి.
ఈ ఘటనలో ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఇతర నష్టాల పై పూర్తి వివరాలు వెలువడలేదని అధికారులు పేర్కొన్నారు. పరిస్థితిని నియంత్రణలోకి తీసుకురావడానికి అత్యవసర చర్యలు కొనసాగుతున్నాయి.
అలాగే, ప్రజలు అపోహలు, వదంతులను నమ్మకుండా కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని అధికారులు సూచించారు. పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్‌లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్‌గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









