తెలుగమ్మాయి రుత్విక శివాని సత్తా చాటింది..

- August 07, 2016 , by Maagulf
తెలుగమ్మాయి రుత్విక శివాని సత్తా చాటింది..

వీవీ నాథూ మెమోరియల్ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి రుత్విక శివాని సత్తా చాటింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రుత్విక 21-18, 21-6తో తులసిపై గెలుపొంది టైటిల్‌ను దక్కించుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో గురుసాయిదత్ 12-21, 21-17, 14-21తో సౌరభ్ వర్మ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.మహిళల డబుల్స్ ఫైనల్లో సిక్కిరెడ్డి- మనీషా జంట 13-21, 21-18, 21-9తో అపమా బాలన్-ప్రజక్త సావంత్ జోడిని ఓడించగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి జంట 21-16, 21-18తో అర్జున్-శ్లోక్ రామచంద్రన్ జోడిపై గెలుపొందింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయి-మనీషా జంట 18-21, 26-24, 21-14తో జిష్ణు-ప్రజక్త సావంత్ జోడిని ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com