నార్త్ అల్ బటిన్హాలో టొబాకో తయారీ యూనిట్ సీజ్..!!
- May 06, 2026
మస్కట్: నార్త్ అల్ బటిన్హా ( North Al Batinah ) గవర్నరేట్‌లోని వినియోగదారుల రక్షణ డైరెక్టరేట్ జనరల్.. రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో చ్యూయింగ్ టోబాకో తయారీ మరియు విక్రయాల కోసం వినియోగిస్తున్న యూనిట్ ను సీజ్ చేసింది.
గవర్నరేట్‌లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఈ పదార్థాలను తయారు చేస్తూ, విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఈ దాడిలో పొగాకు తయారీకి ఉపయోగించే మూడు యంత్రాలతో పాటు, 800 కిలోలకు పైగా "Al Ghilyoon" వుడ్ తోపాటు 80 కిలోల విక్రయానికి సిద్ధంగా ఉన్న పొగాకు, 20 కిలోల పొడి పొగాకు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తయారీ ప్రక్రియలో ఉపయోగించే ముడి పదార్థాలైన 43 కిలోల అల్ షన్నా (Al Shanna) మరియు 112 కిలోల అల్ నూర్హా (Al Noorah) లను కూడా సీజ్ చేసినట్టు తెలిపారు. ఇలాంటి ఏవైనా ఉల్లంఘనలు కనిపిస్తే అధికారికారులకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









