దుబాయ్‌లో సింగిల్ మమ్ ని వరించిన అధృష్టం..!!
- May 08, 2026
యూఏఈ: దుబాయ్‌లో నివసిస్తున్న చైతన్య కుమారి రామచంద్రన్ 1 మిలియన్ దిర్హమ్ల బిగ్ టికెట్ బహుమతి గెలుచుకున్నారు. ఈ డబ్బను విలాసవంతమైన షాపింగ్ లేదా ఆడంబరమైన వేడుకల కోసం ఖర్చు పెట్టబోనని, ఎక్కువ భాగం తన కూతురు విదేశాల్లో న్యాయశాస్త్రం చదవాలనే కల కోసం వెచ్చించనున్నట్టు ఈ సింగిల్ మామ్ తెలిపారు.
తన కూతురు 10వ తరగతి పూర్తి చేసి, ఇప్పుడు 11వ తరగతిలో ఉందని, ఆమె యూకే లేదా ఆస్ట్రేలియాలో ఎక్కడైనా న్యాయశాస్త్రం చదవాలనుకుంటోందని తెలిపారు. అందుకే తాను ఈ డబ్బును ఆమె చదువు కోసం ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నట్టు చైతన్య చెప్పారు.
14 ఏళ్లుగా యూఏఈలో నివసిస్తున్న ఆమె, దుబాయ్‌లో కంప్యూటర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. తాను ప్రస్తుతం భారత్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. తొలుత తన స్నేహితులు విషయం చెప్పగానే స్పామ్ అనుకున్నట్లు తెలిపారు. బిగ్ టికెట్ వెబ్సైట్ లో చూసి నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొన్నారు. తాను 1 మిలియన్ దిర్హమ్లు గెలుస్తానని ఎప్పుడూ ఊహించలేదన్నారు. తాను బిగ్ టికెట్ కొనడం ప్రారంభించిన ఆరవసారే విజేతగా నిలిచినట్లు చైతన్య తెలిపింది. ఇంతకుముందు ఆఫీసు సహోద్యోగులతో కలిసి టిక్కెట్లు కొన్నట్లు వివరించారు.
సింగిల్ మామ్ గా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. విలాసాల కంటే స్థిరత్వానికే ఎక్కువ విలువ ఇవ్వడం నేర్చుకున్నానని చైతన్య చెప్పింది. భవిష్యత్తులో కూడా బిగ్ టికెట్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కొనసాగిస్తానని ఆమె తెలిపింది.
తాజా వార్తలు
- హర్మూజ్‌లో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు
- బహ్రెయిన్‌లో డ్రగ్ ట్రాఫికింగ్..లైఫ్ సెంటెన్స్..!!
- జలీబ్ అల్-షుయూఖ్‌లో 42 ఓల్డ్ బిల్డింగ్ తొలగింపు..!!
- అమీర్ కప్ ఫైనల్..మెట్రోలింక్, మెట్రోఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పులు..!!
- దుబాయ్‌లో సింగిల్ మమ్ ని వరించిన అధృష్టం..!!
- 90వేల మంది లబ్ధిదారులకు ప్లాట్ లేదా రెసిడెన్షియల్ యూనిట్స్..!!
- హోర్ముజ్ జలసంధి పై సౌదీ అరేబియా కీలక ప్రకటన..!!
- అమీర్, ఇటలీ మధ్య బలమైన సంబంధాలు..!!
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి









