పౌరులు భద్రత పరిరక్షణకు సాయుధ దళాలు పూర్తి సిద్ధం..!!

- May 11, 2026 , by Maagulf
పౌరులు భద్రత పరిరక్షణకు సాయుధ దళాలు పూర్తి సిద్ధం..!!

కువైట్ః దేశ భద్రతను కాపాడటానికి, పౌరులు మరియు నివాసితుల భద్రతను పరిరక్షించడానికి సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, కల్నల్ సౌద్ అల్-అత్వాన్ తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన అనేక శత్రు డ్రోన్‌లను కువైట్ సాయుధ దళాలు గుర్తించాయని, సమర్థవంతంగా వాటిని ఎదుర్కొన్నామని ఒక ప్రకటలో తెలియజేశారు. అయితే, డ్రోన్‌ లు ఎక్కడి నుండి వచ్చాయి, వాటిపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఆ ప్రకటనలో వివరాలు వెల్లడించలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com