IRGC-అనుబంధ నెట్‌వర్క్‌లో రద్దు చేసిన మండలి సభ్యులు..!!
- May 11, 2026
మనామాః ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మరియు "విలాయత్ అల్ ఫఖీహ్" సిద్ధాంతంతో సంబంధం ఉన్న ఒక సంస్థలో రద్దు చేసిన ఇస్లామిక్ పండితుల మండలికి అనుబంధంగా ఉన్న సభ్యులు, వారి అనుచరులు ఉన్నారని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఈ బృందంలోని సభ్యులు ఒక ఉగ్రవాద సంస్థను స్థాపించి, దానికి నాయకత్వం వహించారని తెలిపారు. ఇది ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఇరాన్, ఇరాక్ మరియు లెబనాన్లలో ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేసేవారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
బహ్రెయిన్‌లో ఈ సంస్థకు చెందిన 41 మంది సభ్యులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సదరు సంస్థ బహ్రెయిన్‌లోని షియా వర్గానికి చెందిన సభ్యులే లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడిందని వెల్లడించారు. ఈ సంస్థపై చాలా కాలంగా నిఘా ఉందని, బహ్రెయిన్ భద్రత మరియు పౌర శాంతిని పరిరక్షించడానికే ఇటీవలి చర్యలు తీసుకున్నట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.జాతీయ భద్రత, సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీసే ఏ ప్రయత్నాలనైన బహ్రెయిన్ కఠినంగా వ్యవహారిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







