IRGC-అనుబంధ నెట్‌వర్క్‌లో రద్దు చేసిన మండలి సభ్యులు..!!

- May 11, 2026 , by Maagulf
IRGC-అనుబంధ నెట్‌వర్క్‌లో రద్దు చేసిన మండలి సభ్యులు..!!

మనామాః ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మరియు "విలాయత్ అల్ ఫఖీహ్" సిద్ధాంతంతో సంబంధం ఉన్న ఒక సంస్థలో రద్దు చేసిన ఇస్లామిక్ పండితుల మండలికి అనుబంధంగా ఉన్న సభ్యులు, వారి అనుచరులు ఉన్నారని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఈ బృందంలోని సభ్యులు ఒక ఉగ్రవాద సంస్థను స్థాపించి, దానికి నాయకత్వం వహించారని తెలిపారు. ఇది ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఇరాన్, ఇరాక్ మరియు లెబనాన్‌లలో ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేసేవారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

 బహ్రెయిన్‌లో ఈ సంస్థకు చెందిన 41 మంది సభ్యులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సదరు సంస్థ బహ్రెయిన్‌లోని షియా వర్గానికి చెందిన సభ్యులే లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడిందని వెల్లడించారు. ఈ సంస్థపై చాలా కాలంగా నిఘా ఉందని, బహ్రెయిన్ భద్రత మరియు పౌర శాంతిని పరిరక్షించడానికే ఇటీవలి చర్యలు తీసుకున్నట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.జాతీయ భద్రత, సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీసే ఏ ప్రయత్నాలనైన బహ్రెయిన్ కఠినంగా వ్యవహారిస్తుందని మంత్రిత్వ శాఖ  స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com