'భోగి' మందారం గా డింపుల్ హయాతి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్
- May 11, 2026
చార్మింగ్ స్టార్ శర్వా, మాస్ మేవరిక్ సంపత్ నందితో కలిసి చేస్తున్న భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ సాగా 'భోగి'. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మాణంలో, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం, శర్వా కెరీర్లో అత్యంత భారీ స్థాయి వెంచర్లలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ప్రమోషనల్ మెటీరియల్‌కు లభించిన అద్భుతమైన స్పందన నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ఇప్పుడు డింపుల్ హయాతి పాత్ర లుక్‌ను రిలీజ్ చేశారు.
డింపుల్ హయతి ఈ చిత్రంలో ‘మందారం’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆమె ఎర్ర చీరలో బోల్డ్ అండ్ స్టన్నింగ్ లుక్‌లో ఆకట్టుకున్నారు. చేతిలో విసనకర్ర పట్టుకుని, ఇంటెన్స్ హావభావాలతో కనిపిస్తున్న ఆమె లుక్ 1960ల కాలాన్ని ప్రతిబింబించేలా ఉంది. పోస్టర్లో కనిపించిన వింటేజ్ బ్రాస్ బాక్స్, గ్రామీణ వాతావరణం ఆమె పాత్రకు మరింత బలం చేకూర్చాయి. ఆమె చూపుల్లోనే ఒక తిరుగుబాటు స్వభావం కనిపిస్తోంది.
ఈ లుక్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసిన మేకర్స్… “ ప్రపంచం కోరుకున్న సౌందర్యం.. ప్రపంచం ఎన్నడూ అర్థం చేసుకోని ఆత్మ, మందారంను పరిచయం చేస్తున్నాం” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రపంచం గురించి ఏమాత్రం పట్టించుకోని ధైర్యమైన పాత్రగా ఆమె కనిపించనుంది.
ఇటీవల చిత్ర యూనిట్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించింది. హైదరాబాద్‌లో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో 1960ల కాలాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్ నిర్మించి షూటింగ్ నిర్వహిస్తున్నారు. సినిమా స్కేల్, యాక్షన్ ఇంటెన్సిటీపై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆమె లుక్ కు తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కల్పిత గ్రామాన్ని నేపథ్యంమంచి రెస్పాన్స్ వచ్చింది. 1960ల కాలంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ‘భోగి’ రూపొందుతోంది.
శర్వానంద్ పాత్ర కోసం చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆయన రగ్గడ్ బాడీ లాంగ్వేజ్ ఇప్పటికే సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. యాక్షన్, మాస్ ఎంటర్టైనర్స్ తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సంపత్ నంది ఈ సినిమాను పూర్తి స్థాయి విజువల్ బ్లడ్‌బాత్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు.
టెక్నికల్గాఈ చిత్రం బలంగా ఉంది. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్షన్ నిర్వహిస్తుండగా, ఏ. కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకి ఎమోషన్స్ తో పాటు మాస్ ఎనర్జీని జోడించనుంది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘భోగి’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2026 ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
DOP: A. కిషోర్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







