'వీరభద్రుడు' థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకునే మంచి మాస్ మసాలా ఎంటర్‌టైనర్: హీరో సూర్య
- May 11, 2026
'వీరభద్రుడు'లాంటి క్యారెక్టర్‌ను అన్నయ్య మాత్రమే చేయగలరు. ఇలాంటి సినిమాలు థియేటర్‌లోనే చూడాలి: హీరో కార్తి
సూర్య మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'వీరభద్రుడు'. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలని సృష్టించాయి. ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిలీజ్ అవుతుంది. మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో కార్తి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత సుప్రియా యార్లగడ్డ పాల్గొన్నారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చాలా అదృష్టవంతుడిగా భావిస్తాను. నాకు తెలుగు అంత బాగా రాకపోవచ్చు… కానీ తెలుగు వారి మనసు మాత్రం నాకు బాగా తెలుసు. సుప్రియ గారితో మాకు ఎప్పటినుంచో చాలా మంచి స్నేహం ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను రిలీజ్ చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాం. ఇంత అద్భుతమైన ప్రమోషన్స్, రిలీజ్ ప్లానింగ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాతో ప్రేక్షకులు ఖచ్చితంగా చాలా సంతృప్తి పొందుతారు. రాకేందు మౌళి గారు చాలా చక్కని మాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి గారికి, శ్యామ్ గారికి థ్యాంక్యూ. చాలా మంచి పాటలు రాశారు. వాటికి మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. ఆర్.జే. బాలాజీ గారి జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన మల్టీ టాలెంటెడ్. ఈ కథను చాలా సిన్సియర్‌గా రాశారు… అంతే సిన్సియర్‌గా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ చాలా మంచి ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా సాగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం పూర్తి స్థాయి థియేటర్ మాస్ మసాలా మూమెంట్స్‌తో ఉంటుంది. చాలా మంచి హ్యూమర్, ఫన్ ఉంటాయి… ఇది నా ప్రామిస్. మే 14న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమాను నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఆర్.జే. బాలాజీ, జీకే విష్ణు కలిసి నన్ను చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఈ మధ్యకాలంలో వచ్చిన నా సినిమాలన్నింటికంటే చాలా డిఫరెంట్‌గా చూపించారు. త్రిషతో 23 ఏళ్ల తర్వాత కలిసి పనిచేసిన సినిమా ఇది. తను చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. విక్రమ్ గారు అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేశారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ దీన్ని చాలా స్పెషల్‌గా ట్రీట్ చేసి పనిచేశారు. ఆ సిన్సియర్ ఎఫర్ట్ మీ అందరికీ సినిమాలో కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్. మీ ఆశీస్సులు, ప్రేమ మాకు కావాలి. మీ అందరి సపోర్ట్‌కి, అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
హీరో కార్తీ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మీ ప్రేమకి హృదయపూర్వక కృతజ్ఞతలు. షూటింగ్ జరుగుతుండగా ఇక్కడ ‘రోలెక్స్’ ఉన్నారని చెప్పారు. అందుకే హాయ్ చెప్పాలని వచ్చాను. ( నవ్వులు). ఈ సినిమా ఫస్ట్ లుక్ నాకు చాలా నచ్చింది. ఇది మాస్ మసాలా అలాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని కూడా చెప్పొచ్చు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్‌ని నేను చాలా ఎంజాయ్ చేశాను. గజని డేస్ గుర్తుకు వచ్చాయి. ఇలాంటి క్యారెక్టర్‌ను అన్నయ్య మాత్రమే చేయగలరు. ఆ మాస్ ఆయనకే సాధ్యపడుతుంది. నేను తప్పకుండా తెలుగు వెర్షన్ కూడా చూస్తాను. ఇలాంటి సినిమాలు థియేటర్‌లోనే చూడాలి. సినిమాను సెలబ్రేట్ చేసుకునే ప్రేక్షకుల కోసం తీసిన చిత్రం ఇది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే వెంకీతో చేస్తున్న సినిమా కూడా మీ అందరి ప్రేమను అందుకోవాలని ఆశిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.
డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఒక డివైన్ ఎలిమెంట్‌తో పాటు సోషల్ యాంగిల్‌ను అద్భుతంగా మిక్స్ చేసి ఆర్.జే. బాలాజీ గారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా అన్ని చోట్ల పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్.జే. బాలాజీ గారి ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం. ఆయన ఆర్జేగా ప్రారంభించి, దర్శకుడిగా, నటుడిగా… ప్రతి పాత్రలోనూ అద్భుతంగా రాణించారు. సూర్య గారిని, కార్తి గారిని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు. వాళ్ల సినిమాలు తమిళంలో రిలీజ్ అయితే ఎంత పండగలా ఉంటుందో, తెలుగులో కూడా అంతే పండగ వాతావరణం ఉంటుంది. సూర్య గారు ఎంతో హంబుల్ హ్యూమన్ బీయింగ్. ఆయనతో దాదాపు 90 రోజులు పని చేసే అవకాశం వచ్చింది. ఆయన చేసే సమాజ సేవ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా గొప్ప విజయాలు సాధించి, అద్భుతాలు క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ ఆర్.జే. బాలాజీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సూర్య గారి సినిమాలను తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ సినిమాను కూడా అన్ని భాషల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా అద్భుతంగా తీర్చిదిద్దాం. దర్శకుడిగా నేను సూర్య గారితో సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సూర్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఏముంటుందో ట్రైలర్‌లో కొంత మాత్రమే చూపించాం. సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజ్‌లు ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ఎంటర్‌టైనింగ్ మాస్ మసాలా ఫిల్మ్. అభిమానులు చూడాలనుకునే సూర్య సార్‌ను ఈ సినిమాలో చూపించాం. సినిమాను సెలబ్రేట్ చేసుకునే ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమాతో సూర్య గారికి ఒక బ్లాక్‌బస్టర్ ఇస్తానని నేను మాట ఇచ్చాను. ఖచ్చితంగా ఈ సినిమా మా నమ్మకాన్ని నిలబెడుతుంది. ఇది ఒక ఇంటెలిజెంట్ కమర్షియల్ ఫిల్మ్. సుప్రియ గారికి ధన్యవాదాలు. తెలుగు డైలాగ్స్‌ను రాకేందు మౌళి గారు అద్భుతంగా రాశారు. సాయి అభ్యంకర్ చాలా మంచి సంగీతం అందించారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది.
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా అద్భుతమైన ఎమోషన్స్‌తో కూడిన సినిమా. పాటలన్నీ కూడా ఎంతో అద్భుతంగా వచ్చాయి. ఈరోజు ఈ వేడుకలో సూర్య గారిని, కార్తి గారిని పక్కపక్కన చూడడం కన్నుల పండుగలా అనిపించింది. సాయి అభ్యంకర్ చాలా అద్భుతమైన సంగీతం అందించారు. బాలాజీ గారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ..సూర్య గారు హీరోగా వస్తేనే అదరగొడతారు. ఇప్పుడు ‘గాడ్ మోడ్’లో వస్తున్నారు… ఇక ఏ లెవెల్‌లో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఈరోజుల్లో న్యాయం అనేదే ఒక మిరాకిల్ అయిపోయింది. ఆ మిరాకిల్‌ని చూడాలంటే దేవుడే దిగి రావాలి అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. అలా దిగివచ్చిన దేవుడే ‘వీరభద్రుడు’. ఎస్.ఆర్. ప్రభు గారు ‘ఖైదీ’ సినిమాకు నాకు మొదటిసారి డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి వరుసగా ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కార్తి అన్న ఎప్పుడూ నాకు సొంత తమ్ముడిలా సపోర్ట్ చేస్తుంటారు. సూర్య అన్న కూడా నాకు సొంత అన్నయ్యలానే. ‘వీరభద్రుడు’ అన్యాయాన్ని అస్సలు వదలడు. మే 14న మీ ముందుకు వస్తున్నాడు. అందరూ థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
ఫైట్ మాస్టర్ విక్రమ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను ‘కాంతార’, ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ చిత్రాలకు ఫైట్ మాస్టర్‌గా పనిచేశాను. నాకు రెండు నేషనల్ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సూర్య గారికి ధన్యవాదాలు. సూర్య గారు ఫైట్స్‌కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. రిహార్సల్స్‌కు కూడా ఎంతో క్రమశిక్షణతో ముందుగానే వచ్చేస్తారు. ఆయన మొదటి సినిమాలో ఉన్న ఎనర్జీని ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ బాలాజీ గారికి థ్యాంక్యూ. టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో ఫైట్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది.
తారాగణం: సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి, శ్శివాడ, సుప్రీత్ రెడ్డి
రచన & దర్శకత్వం: RJ బాలాజీ
సినిమాటోగ్రఫీ - జికె విష్ణు
సంగీతం - సాయి అభ్యంకర్
యాక్షన్ అన్బరివ్ - విక్రమ్ మోర్
ఎడిటర్ - ఆర్.కళైవానన్
ప్రొడక్షన్ డిజైన్ - అరుణ్ వెంజారామూడు
నిర్మాతలు: ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు
తెలుగు రిలీజ్ : అన్నపూర్ణ స్టూడియోస్
పీఆర్వో - వంశీ-శేఖర్
తాజా వార్తలు
- చంద్రబాబు ఇంటి పై పేర్ని నాని సంచలన ఆరోపణలు
- వెస్ట్ బెంగాల్: జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
- IPL 2026: పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
- ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ
- సింగపూర్‌లో మంత్రి లోకేష్..
- హనుమ జయంతి శుభాకాంక్షలు తెలిపిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
- మలేషియాలో ఘనంగా 'ఎన్టీఆర్ సజీవ చరిత్ర' పుస్తకావిష్కరణ
- రూపాయి పతనం..95.31కి పడిపోయిన భారత కరెన్సీ
- మచిలీపట్నం అభివృద్ధి అంశాల పై కేంద్ర కార్యదర్శితో ఎంపీ బాలశౌరి సమావేశం
- మాజీ IPS భార్య హత్య కేసులో కీలక పరిణామం..









