ఖుబా మసీదు..ఆటోబస్ షటిల్ సేవలు ప్రారంభం..!!

- May 12, 2026 , by Maagulf
ఖుబా మసీదు..ఆటోబస్ షటిల్ సేవలు ప్రారంభం..!!

మదీనాః మదీనా ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సహకారంతో రవాణా సాధారణ ప్రాధికార సంస్థ (TGA) మదీనాలోని ఖుబా మసీదు లోపలి ప్రాంగణంలో ఆటోమేటిక్ “రోబో బస్” షటిల్ బస్సు సేవలను పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. ఇది సందర్శకులకు వినూత్నమైన మరియు సురక్షితమైన రవాణాను అందిస్తుందని అధికారులు తెలిపారు. గరిష్టంగా 20 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించే సౌకర్యం ఉంటుందన్నారు.
ఆధునిక సెన్సార్లు మరియు హై-రిజల్యూషన్ కెమెరాల మద్దతుతో ఏఐ వ్యవస్థ ద్వారా ఇది రన్ అవుతుందని ప్రకటించారు. ఈ రోబో బస్ కోసం ఖుబా మసీదు లోపలి ప్రాంగణంలో 700 మీటర్ల వరకు ప్రత్యేక మార్గాన్ని రూపొందించారు. ఈ పైలెట్ ప్రాజెక్టు 60 రోజులపాటు కొనసాగనుంది.
రోబో బస్ అనేది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కోసం రూపొందించిన ఒక L4 ఆటోమెటిక్ విద్యుత్ ఆధారిత డ్రైవర్‌లేని మినీబస్. ఈ వాహనాలు నావిగేట్ చేయడానికి అధునాతన LiDAR, కెమెరాలు మరియు AIని ఉపయోగిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com