యూఏఈలో స్కిన్ కేర్ ట్రెండ్‌లపై పేరెంట్స్ కు వార్నింగ్..!!

- May 12, 2026 , by Maagulf
యూఏఈలో స్కిన్ కేర్ ట్రెండ్‌లపై పేరెంట్స్ కు వార్నింగ్..!!

యూఏఈ: ఏడేళ్ల వయసులో, ఆమె బొమ్మలతో ఆడుకోవాల్సింది. కానీ, దానికి బదులుగా, ఆమె ఒక స్కిన్ కేర్ క్లినిక్‌లో కూర్చుని ఉంది. వాచిపోయి, ఇన్ఫెక్షన్ సోకిన తన వేలికొనలకు చికిత్స తీసుకుంటుంది.  

పెద్దలు వాడే మెరిసే నెయిల్ పాలిష్. ఆమె దానిని ఓ వీడియోలో చూసి, వాళ్ళు చేసినట్టుగా చేసి, తన చిన్న చేతులకు రాసుకుంది. ఆ తర్వాత, ఆమె వయసున్న ఏ బిడ్డకూ రాకూడని బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు తొమ్మిది నెలల చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.

నెలకో కేసు

ప్రతి నెలా తమ క్లినిక్‌కు ఇలాంటి కేసు ఒకటి వస్తూనే ఉంటుందని 30 ఏళ్లకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న స్కిన్‌మెడ్ మెడికల్ సెంటర్‌లోని స్పెషలిస్ట్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సలేం అంటాబి అంటున్నారు. ఒక చిన్నారి చర్మం మందం.. పెద్దవారి చర్మం మందంలో సుమారు ముప్పై శాతం మాత్రమే ఉంటుందన్నారు. నీరు అధికంగా ఉండి, నూనె తక్కువగా ఉంటుందన్నారు. యుక్తవయస్సు తర్వాత పెద్దవారి శరీరంలో ఏర్పడే రక్షిత లిపిడ్ పొర ఇంకా ఏర్పడి ఉండదని డాక్టర్ పేర్కొన్నారు.  

చర్మానికి ప్రమాదకరం

ఒక పెద్ద మహిళతో పోలిస్తే, చిన్నారి ముఖానికి రాసే ఏ పదార్థమైనా వేగంగా, లోతుగా, మరియు మరింత ప్రమాదకరంగా చర్మంలోకి ఇంకిపోతుందని హెచ్చరించారు.  పిల్లల చేతులకు చేరే పదార్థాల జాబితా ఒక రసాయన హెచ్చరిక పత్రంలా ఉంటుందని,  ఫినాల్, హార్మోన్ల అసమతుల్యతతో సంబంధం ఉంటుందని తెలిపారు. ఫార్మాల్డిహైడ్.. నెయిల్ పాలిష్‌లు, లిప్‌స్టిక్‌లలో గుర్తించిన ఒక విషపదార్థం. బెంజోఫినోన్‌లు, అంతఃస్రావ వ్యవస్థపై ప్రభావం చూపేవిగా ఉంటాయని,  పారాబెన్‌లు, హార్మోన్ల జోక్యంతో సంబంధం ఉన్నవని వివరించారు. పిల్లల కోసం లేబుల్ ఉన్న ఉత్పత్తులలో వీటిలో చాలా వరకు కనిపిస్తాయని డాక్టర్ అంటాబి హెచ్చరిస్తున్నారు.  

ఒక మానసిక స్థితి

న్యూరాన్ సైకలాజికల్ కేర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఇవా జజోనీ మాట్లాడుతూ.. ఒక చిన్న అమ్మాయి మనసులో వాస్తవానికి ఏమి జరుగుతుందో వివరించారు. "కాస్మెటికోరెక్సియా అనే చర్మ సంరక్షణను ఒక వైద్య అవసరంగా కాకుండా, ఒక అవసరమైన ఆచారంగా భావిస్తారు. 'పెద్దవారిలా' కనిపించాలనే కోరికతో వాళ్లు సోషల్ మీడియా ప్రభావానికి గురై, తమకు పడని క్రీములను ఉపయోగిస్తుంటారు.   ఇలాంటి మానసిక ధోరణలు బాల్యాన్నే నిశ్శబ్దంగా హైజాక్ చేయడమేనని జజోనీ హెచ్చరించారు. 

జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ సైకాలజీలో 2024లో ప్రచురించిన ఒక అధ్యయనం.. చిన్న వయసులోనే సౌందర్య ఉత్పత్తులకు అలవాటు పడటానికి మరియు కౌమారదశలో ఉన్నవారిలో ఆందోళన, కుంగుబాటు రేట్లు పెరగడానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని గుర్తించినట్లు తెలపింది.  

సోషల్ మీడియానే దోషి

పన్నెండేళ్ల కుమార్తె తల్లి అయిన వర్దా అల్-హషేమి మాట్లాడుతూ.. అమ్మాయిలకు అతి పెద్ద సవాల్ సోషల్ మీడియానే అని అన్నారు.  ముఖ్యంగా తమ వయసు వాళ్లైన ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రతిరోజూ ఈ ఉత్పత్తులను వాడటం చూసినప్పుడు..వాళ్లను అనుకరించాల్సిందేనని ఆ అమ్మాయి భావిస్తుందన్నారు.  

ఆమె ఇంట్లో వాడే వస్తువులు సన్‌స్క్రీన్, మాయిశ్చరైజర్, లిప్ బామ్, కొద్దిగా లైట్ బ్లష్. అంతకు మించి ఏమీ ఉండదు. "నేను ప్రశాంతంగా కానీ దృఢంగా తిరస్కరిస్తాను. ఆమె ఆరోగ్యం, ఆమె ఆత్మవిశ్వాసమే అత్యంత ముఖ్యం. ట్రెండ్ కాదు." అని పేర్కొన్నారు.

విడమరచి చెప్పండి

పదమూడేళ్ల కుమార్తె తల్లి అయిన హనా ఐడరూస్, ఒక విభిన్నమైన ఆయుధాన్ని ఎంచుకున్నారు. ఆమె చర్మం ఇంకా యవ్వనంగా ఉందని తాను ఆమెకు వివరిస్తాను అని తెలిపారు. "నిషేధించడం లక్ష్యం కాదు. రక్షించడమే లక్ష్యం." అని తెలిపారు. పిల్లలను ఆకర్షించే విధంగా ప్లాట్‌ఫారమ్‌లు మార్కెటింగ్ చేస్తాయి. కానీ అంతిమంగా, నిర్ణయం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుందని తెలిపారు.

మెరుపు ఫిల్టర్లు, డిజిటల్ ఎడిటింగ్

సాధారణంగా ఐదు నుండి ఏడు సంవత్సరాల వయస్సులో, పిల్లలు మేకప్ లేదా చర్మ సంరక్షణతో ఆడుకోవడం పట్ల ఆసక్తి చూపుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకటనలలో కనిపించే ఆమె, చూసే మెరుపు ఫిల్టర్లు, డిజిటల్ ఎడిటింగ్ వల్ల వస్తుందని వివరించాలని వైద్యులు చెబుతున్నారు.

చర్మవ్యాధి నిపుణులు పదిహేను సంవత్సరాల లోపు పిల్లల కోసం సురక్షితమైన వాటి జాబితాను సూచిస్తున్నారు.  మినరల్ సన్‌స్క్రీన్ (జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్, రసాయనాలు అస్సలు వాడకూడదు), సువాసన లేని మాయిశ్చరైజర్, తక్కువ లిప్ బామ్, మరియు చమోమిలే వాటర్ తరచుగా వినియోగించాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com