యాత్రికులకు స్వాగత కేంద్రాన్ని తనిఖీ చేసిన మదీనా ఎమిర్..!!
- May 12, 2026
మదీనా : హజ్ మరియు ఉమ్రా యాత్రికులకు అందుతున్న సేవలపై మదీనా ఎమిర్ మరియు హజ్, ఉమ్రా కమిటీ ఛైర్మన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ సుల్తాన్ ఆరా తీశారు. ఆయన హిజ్రా రోడ్డులో ఉన్న యాత్రికుల స్వాగత కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. . ఆయన వెంట డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ సౌద్ బిన్ నహర్ మరియు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
యాత్రికులు తమ ఆచారాలను సులభంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి వీలు కల్పించడానికి సౌదీ అరేబియా అన్ని ఏర్పాట్లు చేసిందని మదీనా ఎమిర్ వెల్లడించారు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకులు కింగ్ సల్మాన్ మరియు యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ మద్దతుతో హజ్ మరియు ఉమ్రా వ్యవస్థ నిరంతర అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అనంతరం యాత్రికులకు అందుతున్న సేవలను పరిశీలించారు.
తాజా వార్తలు
- జైలు అంటే శిక్ష మాత్రమే కాదు..సంస్కరణకు కేంద్రంగా మారాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- $6.6 మిలియన్ల బదిలీ ప్రయత్నాన్ని అడ్డుకున్న ROP..!!
- యాత్రికులకు స్వాగత కేంద్రాన్ని తనిఖీ చేసిన మదీనా ఎమిర్..!!
- సబా అల్-అహ్మద్‌లోని అగ్నిప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం..!!
- యూఏఈలో స్కిన్ కేర్ ట్రెండ్లపై పేరెంట్స్ కు వార్నింగ్..!!
- గల్ఫ్ ఐక్యతను చాటిచెప్పిన దోహా జీసీసీ గేమ్స్ ప్రారంభోత్సవం..!!
- రాస్ అల్ ఖైమా డ్యామ్‌లో జారిపడి యువకుడు మృతి..!!
- అమెరికా-ఇరాన్ చర్చలు: పాకిస్థాన్ ‘డబుల్ గేమ్’పై ట్రంప్ ఆగ్రహం
- ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం
- దుబాయ్‌లో ప్రైవేట్ పాఠశాలలకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు









