ట్రక్కులకు కార్గో డాక్యుమెంట్స్ తప్పనిసరి..!!

- May 13, 2026 , by Maagulf
ట్రక్కులకు కార్గో డాక్యుమెంట్స్ తప్పనిసరి..!!

మస్కట్: ట్రక్కుల ద్వారా సరుకు రవాణా సేవలను పొందుతున్న లబ్ధిదారులందరూ కార్గో డాక్యుమెంట్స్ ను తప్పనిసరిగా కలిగి ఉండాలని రవాణా, సమాచార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) తెలిపింది.సరుకు రవాణా కార్యకలాపాలు ప్రారంభించే ముందు రవాణా పత్రం జారీ చేయించుకోవాలనే నిబంధనలను పాటించాలని కోరుతూ ఒక బహిరంగ ప్రకటనను జారీ చేసింది.

ఒమన్ సుల్తానేట్‌లోకి ప్రవేశించే విదేశీ ట్రక్కు నిర్వాహకులతో సహా అందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. లబ్ధిదారులు నఫీత్ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా డాక్యుమెంట్స్ పొందవచ్చని వెల్లడించింది. లాజిస్టిక్స్ సేవలను ఆధునీకరించడానికి ఇది మద్దతు ఇస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com