మెనింగోకాకల్ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన సౌదీ..!!

- May 13, 2026 , by Maagulf
మెనింగోకాకల్ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన సౌదీ..!!

రియాద్: 2026 హజ్ సీజన్‌లో పాల్గొనే సిబ్బంది అందరూ తమ విధులు ప్రారంభించడానికి ముందే మెనింగోకాకల్ వ్యాక్సింగ్ తీసుకోవడం తప్పనిసరి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దులజీజ్ అబ్దుల్బాకీ స్పష్టం చేశారు.

రద్దీగా ఉండే ప్రాంతాల్లో అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రించడానికి, నివారణ చర్యలను బలోపేతం చేయడానికి సుప్రీం హజ్ కమిటీ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్య చేపట్టింది.  రద్దీగా ఉండే వాతావరణాల్లో వ్యాపించే తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నుండి ఈ టీకా రక్షణ కల్పిస్తుందని అబ్దుల్బాకీ వివరించారు. ఆమోదించబడిన మెనింగోకాకల్ వ్యాక్సింగ్ ఐదేళ్ల పాటు చెల్లుబాటు అవుతుందన్నారు. 

హజ్ సీజన్‌లో పని అనుమతి (Work Permit) పొందడానికి టీకా ప్రక్రియను పూర్తి చేయడం ఒక ముందస్తు షరతు అని ప్రతినిధి స్పష్టం చేశారు. టీకా పూర్తిస్థాయి రక్షణను అందించాలంటే, పని ప్రారంభించడానికి కనీసం 10 రోజుల ముందే దానిని తీసుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపారు.  అలాగే, కాలానుగుణ ఇన్ఫ్లుయెంజా (Seasonal Influenza) మరియు COVID-19 టీకాలను కూడా తప్పక తీసుకోవాలని సూచించారు.  వ్యాక్సినేషన్ కోసం సెహతీ యాప్‌లో “అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్” సర్వీస్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని అబ్దుల్బఖీ తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com