దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్‌ లకు ఆహ్వానం..!!

- May 13, 2026 , by Maagulf
దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్‌ లకు ఆహ్వానం..!!

దోహా: దోహా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (DFI), దోహా ఫిల్మ్ ఫెస్టివల్ (DFF) 2026 ఎడిషన్ కోసం అధికారికంగా సినిమాల దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రనిర్మాతలు తమ చిత్రాలను ప్రదర్శించాలని కోరింది. 

దరఖాస్తుల స్వీకరణ మే 10న ప్రారంభమైంది. ప్రస్తుతం కేవలం మూడు కీలక విభాగాలలో మాత్రమే షార్ట్ ఫిల్మ్‌ లను స్వీకరిస్తున్నారు. మేడ్ ఇన్ ఖతార్, అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ పోటీ, మరియు అజ్యాల్ ఫిల్మ్ పోటీ (షార్ట్స్ విభాగం)లు నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్ నవంబర్ 19 నుండి 27 వరకు జరగనుంది. 

ఆసక్తి ఉన్న చిత్రనిర్మాతలు తమ ఎంట్రీలను http://www.dohafilm.com లోని అధికారిక DFI ప్లాట్‌ఫారమ్ ద్వారా సమర్పించాలని సూచించారు. అంతర్జాతీయ షార్ట్ సినిమా పోటీ మరియు అజ్యాల్ షార్ట్ సినిమా పోటీలకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఆగస్టు 1 కాగా, మేడ్ ఇన్ ఖతార్ విభాగానికి చివరి తేదీ సెప్టెంబర్ 1 గా నిర్ణయించారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com