దుబాయ్‌లోని కీలక ప్రదేశాలలో కర్బ్, పోల్ పార్కింగ్ కెమెరాలు..!!
- May 13, 2026
యూఏఈ: దుబాయ్‌లోని మూడు ప్రధాన ప్రదేశాలలో ప్రస్తుతం 500కు పైగా కర్బ్ మరియు పోల్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పార్కిన్ సంస్థ ప్రకటించింది. స్ట్రీట్ పార్కింగ్ కెమెరా వ్యవస్థ యొక్క మొదటి దశలో భాగంగా ఈ కెమెరాలను ట్రేడ్ సెంటర్ 1, బుర్జ్ ఖలీఫా మరియు అల్ కార్నిష్‌లలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో కర్బ్-సైడ్ కెమెరాల ఏర్పాటు మొదటిదని అధికారులు తెలిపారు.
పార్కింగ్ స్థలాల కోసం వెతకడానికి వెచ్చించే సమయాన్ని తగ్గించడం, జరిమానాల ప్రమాదాన్ని తగ్గించడం మరియు పార్కిన్ యాప్ ద్వారా ఆటో-పేమెంట్లను సులభతరం చేయడం ఈ మొదటి దశ లక్ష్యమని పేర్కొన్నరు.
దుబాయ్ లోని నియంత్రిత పార్కింగ్ ప్రాంతాలలో పార్కింగ్ లాట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇంకా అనేక ప్రదేశాలలో అదనంగా 200 కెమెరాలను అమర్చనున్నారు. ఈ వ్యవస్థలు వాహనాల ఫోటోలను తీయడానికి మరియు నంబర్ ప్లేట్లను రీడ్ చయడానికికి AI-సామర్థ్యం గల కెమెరా సాంకేతికతను ఉపయోగిస్తాయి. ఇది ఎంట్రీ, ఎగ్జిట్ సమయాలను నమోదు చేస్తుంది. పార్కింగ్ వ్యవధిని లెక్కించడం, ఫీజుల చెల్లింపు మరియు ఉల్లంఘనలను గుర్తించడానికి వీలు కల్పిస్తుందని పార్కిన్ సంస్థ తన ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లోని కీలక ప్రదేశాలలో కర్బ్, పోల్ పార్కింగ్ కెమెరాలు..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్ లకు ఆహ్వానం..!!
- మెనింగోకాకల్ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన సౌదీ..!!
- ఏఐ (AI)ని ఉపయోగించిన క్రిమినల్ హ్యాకర్లు.. గూగుల్ అలెర్ట్..!!
- ట్రక్కులకు కార్గో డాక్యుమెంట్స్ తప్పనిసరి..!!
- కువైట్ తొలి ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కు కేబినెట్ ఆమోదం..!!
- తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..
- పుదుచ్చేరి సీఎంగా రంగసామి రికార్డు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!









