వీసా నిబంధనల్లో భారతీయ పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్
- May 15, 2026
సమ్మర్ హాలిడేస్ లో ఫ్యామిలీతో విదేశీ పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? మీ ప్లాన్ లో థాయ్‌లాండ్ ట్రిప్ ఉంటే ఈ న్యూస్ మీకోసమే! థాయ్‌లాండ్ వెళ్లాలనుకునే భారతీయ పర్యాటకులకు షాకింగ్ న్యూస్. వీసా లేకుండా అక్కడ ఉండే సమయాన్ని ప్రభుత్వం తగ్గించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువును త్వరలోనే 30 రోజులకు కుదించబోతున్నారు. భారత్‌తో పాటు మొత్తం 93 దేశాల పర్యాటకులకు ఈ కొత్త నిబంధన వర్తించనుంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూనే, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MFA) ఈ ప్రతిపాదనను థాయ్ క్యాబినెట్ ముందు ఉంచింది. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు థాయ్ ప్రభుత్వం వీసా లేని బసను 60 రోజులకు పెంచింది. అయితే, ఇప్పుడు 30 రోజుల పరిమితి అయితేనే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. క్యాబినెట్ ఆమోదం లభించిన తర్వాతే ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. బ్యాంకాక్‌లో లాంగ్ వెకేషన్ ప్లాన్ చేసుకునే వారికి ఈ నిర్ణయం కాస్త ఇబ్బంది కలిగించే విషయమే.
భారతీయుల వీసా రహిత బసపై ప్రభావం ప్రస్తుతం భారతీయులు వీసా లేకుండానే 60 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో ఉండొచ్చు. అందుకే విదేశీ ట్రిప్స్ ప్లాన్ చేసేవారికి థాయ్‌లాండ్ ఫేవరెట్ డెస్టినేషన్‌గా మారింది. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం, పర్యాటకులు తమ రిటర్న్ టికెట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ట్రిప్ 30 రోజులు దాటితే కచ్చితంగా వీసా తీసుకోవాల్సి ఉంటుంది. విమానాశ్రయాల్లో చెక్-ఇన్ సమయంలోనే ఎయిర్‌లైన్స్ సిబ్బంది మీ బస గడువును పరిశీలించే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే, థాయ్‌లాండ్‌లో ఉన్నప్పుడే బసను పొడిగించుకోవచ్చు (Extension). ఇమ్మిగ్రేషన్ బ్యూరో (IB) కార్యాలయానికి వెళ్లి నిర్ణీత ఫీజు చెల్లించి ఈ సదుపాయం పొందవచ్చు.
తాజా వార్తలు
- NEET రీ-ఎగ్జామ్ తేదీ వచ్చేసింది
- మే 20వ తేదిన దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
- భారీగా పెరగనున్న కూరగాయలు, పప్పుల ధరలు
- యూఏఈ అధికారిక పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం
- వీసా నిబంధనల్లో భారతీయ పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్
- చైనాలో ట్రంప్ పర్యటన..తైవాన్ అంశంపై ‘రెడ్ లైన్’ దాటొద్దని హెచ్చరిక!
- భారత్ నుంచి 5 దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
- కువైటైజేషన్ ఆందోళనలు..ప్రవాసుల కోసం రుణ నిబంధనలు కఠినతరం..!!
- భారత జెండా ఉన్న నౌక పై దాడిని ఖండించిన యూఏఈ..!!
- యూఏఈలో మోదీ: మహమ్మద్ బిన్ జాయెద్‌తో ఉన్నత స్థాయి చర్చలు..!!









