కువైట్ లో 'WAMD' సాంకేతిక వైఫల్యాలకు ఫైన్స్..!!
- May 18, 2026
కువైట్ సిటీ: కువైట్ల లో "WAMD" తక్షణ బదిలీ సేవ ద్వారా లావాదేవీలను నిర్వహించడంలో సాంకేతిక వైఫల్యాలు లేదా జాప్యాలు వినియోగదారులను ఇబ్బందులకు బ్యాంకులపై ఆర్థిక జరిమానాలను విధించడం ద్వారా కువైట్ సెంట్రల్ బ్యాంక్.. తక్షణ డిజిటల్ చెల్లింపు సేవలపై పర్యవేక్షణను కఠినతరం చేసింది.
స్థానిక బ్యాంకుల భాగస్వామ్యంతో 2024లో ప్రారంభించబడిన తక్షణ ఎలక్ట్రానిక్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ అయిన "WAMD" ద్వారా కస్టమర్ చెల్లింపు లేదా బదిలీ కార్యకలాపాలను పూర్తి చేయడంలో విఫలమయ్యే బ్యాంకులే లక్ష్యంగా.. జరిమానా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సెంట్రల్ బ్యాంక్ KNETను ఆదేశించింది.
డిలే సమయాన్ని బట్టి బ్యాంకులకు జరిమానాలు విధించబడతాయి: 1 నుండి 4 నిమిషాల మధ్య ఆలస్యానికి KD1, 5 నుండి 15 నిమిషాల మధ్య ఆలస్యానికి KD5, 15 నుండి 30 నిమిషాల మధ్య విఫలమైన బదిలీలకు KD10 మరియు 30 నిమిషాలు దాటిన ఆలస్యానికి KD20గా నిర్ణయించారు.
"WAMD" బదిలీలలో ఏదైనా ఆలస్యం జరిగితే అది నేరుగా KNET పర్యవేక్షణ స్క్రీన్‌పై కనిపిస్తుందని, తద్వారా జరిమానాలను తక్షణమే అమలు చేయడానికి వీలవుతుందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. అయితే, వసూలు చేసిన జరిమానాలను సెంట్రల్ బ్యాంక్‌కు పంపాలా లేక KNETకు పంపాలా అనే విషయంపై చర్చిస్తున్నట్లు బ్యాంకింగ్ అధికారులు చెబుతున్నారు.
కువైట్ అంతటా "WAMD" వాడకం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలోబ్యాంకింగ్ యాప్‌ల ద్వారా మొబైల్ ఫోన్ నంబర్లను ఉపయోగించి తక్షణ బదిలీల కోసం మౌలిక సదుపాయాలను సెంట్రల్ బ్యాంక్ బలోపేతం చేస్తున్న క్రమంలో ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కువైట్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







