కువైట్ లో 'WAMD' సాంకేతిక వైఫల్యాలకు ఫైన్స్..!!

- May 18, 2026 , by Maagulf
కువైట్ లో \'WAMD\' సాంకేతిక వైఫల్యాలకు ఫైన్స్..!!

కువైట్ సిటీ: కువైట్ల లో "WAMD" తక్షణ బదిలీ సేవ ద్వారా లావాదేవీలను నిర్వహించడంలో సాంకేతిక వైఫల్యాలు లేదా జాప్యాలు వినియోగదారులను ఇబ్బందులకు బ్యాంకులపై ఆర్థిక జరిమానాలను విధించడం ద్వారా కువైట్ సెంట్రల్ బ్యాంక్..  తక్షణ డిజిటల్ చెల్లింపు సేవలపై పర్యవేక్షణను కఠినతరం చేసింది.

స్థానిక బ్యాంకుల భాగస్వామ్యంతో 2024లో ప్రారంభించబడిన తక్షణ ఎలక్ట్రానిక్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ అయిన "WAMD" ద్వారా కస్టమర్ చెల్లింపు లేదా బదిలీ కార్యకలాపాలను పూర్తి చేయడంలో విఫలమయ్యే బ్యాంకులే లక్ష్యంగా.. జరిమానా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సెంట్రల్ బ్యాంక్ KNETను ఆదేశించింది.

డిలే సమయాన్ని బట్టి బ్యాంకులకు జరిమానాలు విధించబడతాయి: 1 నుండి 4 నిమిషాల మధ్య ఆలస్యానికి KD1, 5 నుండి 15 నిమిషాల మధ్య ఆలస్యానికి KD5, 15 నుండి 30 నిమిషాల మధ్య విఫలమైన బదిలీలకు KD10 మరియు 30 నిమిషాలు దాటిన ఆలస్యానికి KD20గా నిర్ణయించారు.

"WAMD" బదిలీలలో ఏదైనా ఆలస్యం జరిగితే అది నేరుగా KNET పర్యవేక్షణ స్క్రీన్‌పై కనిపిస్తుందని, తద్వారా జరిమానాలను తక్షణమే అమలు చేయడానికి వీలవుతుందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. అయితే, వసూలు చేసిన జరిమానాలను సెంట్రల్ బ్యాంక్‌కు పంపాలా లేక KNETకు పంపాలా అనే విషయంపై చర్చిస్తున్నట్లు బ్యాంకింగ్ అధికారులు చెబుతున్నారు.

కువైట్ అంతటా "WAMD" వాడకం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలోబ్యాంకింగ్ యాప్‌ల ద్వారా మొబైల్ ఫోన్ నంబర్లను ఉపయోగించి తక్షణ బదిలీల కోసం మౌలిక సదుపాయాలను సెంట్రల్ బ్యాంక్ బలోపేతం చేస్తున్న క్రమంలో ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కువైట్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com