ఫేక్ ఉద్యోగాల పేరిట మహిళలను ఆకర్షించి, లైంగిక దోపిడీ..!!
- May 18, 2026
మనామా: బహ్రెయిన్‌లో ఒక ఫేస్‌బుక్ ఉద్యోగ ప్రకటన ఇద్దరు యువతులను మానవ అక్రమ రవాణా కేసులోకి లాగింది. వారిని తప్పుడు ఉద్యోగ ఆఫర్లతో మోసం చేసి, లైంగిక దోపిడీకి గురిచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
హై క్రిమినల్ అప్పీల్ కోర్ట్ ఇద్దరు నిందితులకు ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 2,000 బహ్రెయిన్ దినార్ల (BD) జరిమానా విధిస్తూ గతంలో ఇచ్చిన తీర్పులను సమర్థించింది. శిక్షాకాలం పూర్తయ్యాక, దేశ బహిష్కరణకు ముందు బాధితులను స్వదేశానికి పంపించేందుకు అయ్యే ఖర్చులను కూడా వారే భరించాలని కోర్టు ఆదేశించింది.
బాధితుల్లో ఒకరైన 23 ఏళ్ల మహిళ, బహ్రెయిన్‌లో ఒక రెస్టారెంట్ ఉద్యోగాన్ని అందిస్తున్న ఫేస్‌బుక్ ప్రకటనకు స్పందించింది. నిందితులలో ఒకరిని సంప్రదించిన తర్వాత, ఆమెతో పాటు అదే తరహాలో మరో మహిళ వారి ట్రాప్ లో పడ్డారు. విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికి ఒక అపార్ట్‌మెంట్‌కు తీసుకువెళ్లారు. అక్కడ వాళ్లను నిర్బంధించి, వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టారు. పని ఇప్పిస్తామని తప్పుడు ప్రకటనలతో మహిళలను ఆకర్షించి, లైంగిక దోపిడీకి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందని బహ్రెయిన్ మానవ అక్రమ రవాణా నిరోధక డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!







