భారత, ఆస్ట్రియాలతో ఒమన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!

- May 19, 2026 , by Maagulf
భారత, ఆస్ట్రియాలతో ఒమన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!

మస్కట్: ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితితులపై భారత, ఆస్ట్రియా విదేశాంగ మంత్రులతో ఒమన్ విదేశాంగ మంత్రిఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సహకార రంగాలతోపాటు హోర్ముజ్ జలసంధిలో నౌకాయానానికి అంతరాయం, ఉద్రిక్తతలను తగ్గించడం, సంక్షోభానికి శాశ్వత, సుస్థిర పరిష్కారాలను కనుగొనడానికి దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన అంశాల పై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో చర్చించారు.

అలాగే, సముద్ర సఫ్లై చైన్ లను అనుమతించడానికి,  అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించడానికి దౌత్య ప్రయత్నాలను కొనసాగించడం గురించిఆస్ట్రియా గణతంత్ర యూరోపియన్ మరియు అంతర్జాతీయ వ్యవహారాల ఫెడరల్ మంత్రి బీట్ మీన్ల్-రైసింగర్ తోనూ చర్చలు జరిపారు. సంక్షోభ నివారణకు దౌత్య ప్రయత్నాలను  ముమ్మరం చేయాలని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com