సౌదీ అరేబియాలో 5 హెల్త్ సెంటర్లు సీజ్, 130 సెంటర్లకు నోటీసులు..!!

- May 19, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో 5 హెల్త్ సెంటర్లు సీజ్, 130 సెంటర్లకు నోటీసులు..!!

రియాద్ః సౌదీ అరేబియాలో నిబంధనలు పాటించని 5 హెల్త్ సెంటర్లు సీజ్ చేయడంతోపాటు 130 సెంటర్లకు నోటీసులు జారీచేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రియాద్, మదీనా మరియు అసిర్ తదితర ప్రాంతాలలో ఏప్రిల్ నెలలో దాదాపు 1500కు పైగా హెల్త్ సెంటర్లను తనిఖీలు చేపట్టినట్టు తెలిపింది. ముఖ్యంగా ఉల్లంఘనల్లో లైసెన్స్ లేకుండా వైద్యం చేయడం,  సరైన లైసెన్సింగ్ లేకుండా నర్సింగ్ సిబ్బంది ద్వారా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియలను నిర్వహించడం వంటివి ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇతర ఉల్లంఘనలలో ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలకు సంబంధించిన లోపాలు మరియు అవసరమైన మందులు, వైద్య పరికరాల కొరత కూడా ఉన్నాయని పేర్కొంది.
పేషంట్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించింది. గతంలో మూసివేసిన కేంద్రాలలో సేవలు పొందిన లబ్ధిదారులకు మద్దతు ఇవ్వడానికి 937 అనే యూనిఫైడ్ నెంబర్ ను కేటాయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నంబర్ కు కాల్ చేయడం ద్వారా అవసరమైన వైద్య సంప్రదింపులతోపాటు వైద్య సహాయాన్ని పొందవచ్చని పేర్కొంది.ఇక నిబంధనలకు అనుగుణంగా లేని సంస్థలను మూసివేయడంతోపాటు SR100,000 వరకు జరిమానాలు,  లైసెన్స్ లేని వైద్యులకు ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించడం వంటివి ఉంటాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com