మెక్సికో దేశంలో పెను గాలులతో కూడిన భారీ వర్షాలు...
- August 08, 2016
మెక్సికో దేశంలో పెను గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 38మంది మృత్యువాత పడ్డారు. అధికారుల వివరణ ప్రకారం.. గత 24 గంటలుగా కుండపోతగాకురుస్తున్న వర్షాల కారణంగా పుయెబ్లా రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడడంతో పలుచోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద 28 మంది మృతిచెందగా వారిలో 15మంది పిల్లలు వున్నట్లు సమాచారం. వెరాక్రూజ్‌లోనూ ఇలాంటి పరిస్థితుల్లోనే మరో పది మంది ప్రాణాలను కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
హాచినాంగో పట్టణంలో సాధారణంగా నెల వ్యవధిలో కురిసే వర్షం ఒక్క రోజులో కురవడంతో ఏకంగా ఒక కొండే కుప్ప కూలింది. కరిగి నీరయ్యింది. కొండను ఆనుకుని ఉన్న గ్రామాన్ని ఆ బురదనీరు ముంచెత్తడంతో 11 మంది మృతిచెందారు. వెరాక్రూజ్‌లో నదులు పొంగిపొరలుతుండగా పుయెబ్లాలో వందలాది మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







