అక్బర్‌ - బీర్బల్‌ - ఓ ఉపాయం

- July 24, 2015 , by Maagulf
అక్బర్‌ - బీర్బల్‌ - ఓ ఉపాయం

కొన్ని కారణాల వల్ల అక్బర్‌ ఆస్థాన మంత్రి బీర్బల్‌కూ, రాజుగారైన అక్బర్‌కూ మధ్య వివాదాలు ఏర్పడి అక్బర్‌, బీర్బల్‌ను ఆస్థానం నుండి బయటికి పంపించేశాడు. ఆ స్థానంలో మరొక వ్యక్తిని మంత్రిగా నియమించుకున్నాడు అక్బర్‌. కానీ ఆ మంత్రి బీర్బల్‌లా అంత చాకచక్యంగా నిర్ణయాలు, అభిప్రాయాలు తెలియ చెప్పలేకపోయేవాడు. దాంతో కొన్నాళ్లకి అక్బర్‌కు, బీర్భల్‌ గుర్తుకు రాసాగాడు. దాంతో అక్బర్‌ ఒక ఉపాయం ఆలోచించి, తన ఆస్థాన జమీందార్లందరికీ ఒక సవాల్‌ విసిరాడు. మర్నాడు ఉదయం వారు తమ రాజ్యంలోని బావులను తీసుకుని రాజధానికి రావాలని లేకుంటే తగిన శిక్షకు గురి కాగలరని హుకుం జారీ చేశాడు. దాంతో ఏం చెయ్యాలో తోచక జమీందారులంతా బయటికి వచ్చి ఆలోచనలో పడ్డారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బీర్బల్‌ చెవిని చేరింది. దాంతో బీర్బల్‌ జమీందారుల చెంతకు వచ్చి ఇక ఉపాయం చెప్పాడు. దాని ప్రకారం వారంతా మరునాడు ఉదయమే రాజధాని పొలిమేరకు చేరుకొని తమని ఆహ్వానించడానికి రాజపరివారమూ, మేము తెచ్చిన బావులని ఆహ్వానించడానికి రాజధానిలోని బావుల్ని తీసుకుని వెంటనే రాజుగారు ఇక్కడికి రావాలని వార్తను రాజుకు చేరవేశారు. ఆ వార్త అందుకున్న అక్బర్‌ ఈ ఎత్తుగడను అర్ధం చేసుకొని వెంటనే తన పరివారంతో బయలుదేరాడు. అక్కడికి వెళ్లి ఈ ఉపాయం వేసిన వారు ఎవరో దయచేసి బయటికి రావాలని జమీందారులనుద్దేశించి రాజు పిలువగా ఎక్కడో వెనక నుంచి బీర్బల్‌ అక్బర్‌ ముందుకొచ్చి నిలబడ్డాడు. బీర్బల్‌ను చూసి సంతోషంగా అక్భర్‌ తన గుండెలకు హత్తుకుని, తిరిగి తన ఆస్థాన మంత్రిగా నియమించుకున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com