కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రత్యేకంగా 1,150 ఆర్టీసీ బస్సులు..
- August 08, 2016
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణా పుష్కర పనులను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. పుష్కర పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీనాక్షి అగస్తేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాగా కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రత్యేకంగా 1,150 ఆర్టీసీ బస్సులను నడుపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు. పుష్కరాల కోసం కొత్తగా 2,500 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. పుష్కర యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







