మచిల్ సెక్టార్ లో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు మృతి ..

- August 08, 2016 , by Maagulf
మచిల్ సెక్టార్ లో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు  జవాన్లు మృతి ..

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్ లో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదుల సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారని.. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు ఆర్మీ అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు సైతం మృతి చెందినట్లు తెలిపారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com