పాసెంజర్లకు చుక్కలు చూపించిన డెల్టా
- August 08, 2016
డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ సోమవారం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. కంపెనీ కంప్యూటర్ వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆ సంస్థకు చెందిన విమానాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో డెల్టా విమానాలు ల్యాండ్ అయ్యాయి. ఎక్కడికక్కడ కార్యకలాపాలు నిలిచిపోవడంతో డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకొని అవస్థలు పడ్డారు.అమెరికా అంతటా ఉన్న విమానాశ్రయాలతోపాటు, లండన్‌లోని విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విమానాలు ఆగిపోయి తాము పడుతున్న అవస్థలు ట్విట్టర్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. మరోవైపు డెల్టా కంపెనీ తన ట్విట్టర్ పేజీలో వివరణ ఇచ్చింది. తమ కంపెనీ సిస్టమ్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాలు ఆగిపోయాయని, త్వరలోనే ఈ సమస్య సమసిపోతుందని భావిస్తున్నామని ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







