డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- May 26, 2026
ఆఫీస్ నిర్వహణ, ఫైళ్ల వ్యవస్థ పై కీలక ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని అన్ని అంతస్తులు, విభాగాలను దాదాపు మూడు గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ఆఫీస్ మెయింటెనెన్స్ మరియు ఫైళ్ల నిర్వహణపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
కార్యాలయం మొత్తం ఒకే తరహా ఆకర్షణీయ రూపంలో కనిపించేలా గోడలు, టేబుళ్లు, అల్మారాలకు పెయింటింగ్ పనులు చేపట్టాలని డీజీపీ ఆదేశించారు. అలాగే కాన్ఫరెన్స్ హాళ్లు, ట్రైనింగ్ హాళ్లను ఆధునిక సౌకర్యాలతో మరింత మెరుగ్గా రీడిజైన్ చేయాలని సూచించారు.
విభాగాల వారీగా జరుగుతున్న పనితీరు, పరిపాలనా వ్యవస్థ, కార్యాలయ నిర్వహణ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ, కార్యాలయ వాతావరణం సిబ్బందికి అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, వి.వి. శ్రీనివాసరావు, చారు సిన్హా తదితరులు పాల్గొన్నారు. తమ తమ శాఖల పనితీరు, అమలవుతున్న కార్యక్రమాల వివరాలను డీజీపీకి వివరించారు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్‌తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









