ఢిల్లీ వెళ్ళిన 'బాహుబలి'
- July 25, 2015
బాహుబలి చిత్రం అనుకున్నదాని కంటే మరింత విజయం సాధించడంతో.. సినిమా హీరో ప్రభాస్ ఢిల్లీ వెళ్లాడు. అక్కడ తన పెదనాన్న, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజుతో కలిసి పలువురు ప్రముఖుల వద్దకు వెళ్తున్నాడు. ముందుగా ఆయన శనివారం నాడు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. శాలువాతో రాజ్ నాథ్ ను సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్.. హీరో ప్రభాస్ ను అభినందించారు. బాహుబలిని తెలుగు నుంచి హిందీలోకి కూడా డబ్బింగ్ చేసిన విషయం తెలిసిందే. అది అక్కడ కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. హిందీ వెర్షన్ కు 73 కోట్ల రూపాయలు వచ్చాయి. 7.5 కోట్లు వస్తే చాలని అనుకోగా.. దాదాపు దానికి పది రెట్ల మొత్తం రావడం గమనార్హం.బాహుబలి 2 చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 15న ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







